Kakinada: ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!

|

Aug 26, 2024 | 8:47 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువతి మృతి చెందింది. కోటి ఆశలతో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే తమ బిడ్డ అనంతలోకాలకు చేరడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువతి మృతి చెందింది. కోటి ఆశలతో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే తమ బిడ్డ అనంతలోకాలకు చేరడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంబులెన్స్ లో ఇంటికి చేరుకున్న కన్నబిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాకినాడ 2వ డివిజన్ సౌజన్య నగర్ కు చెందిన చర్లపల్లి హారిక బీటెక్ పూర్తి చేసి గతేడాది సెప్టెంబర్ నెలలో ట్రైనీ ఇంజినీర్ గా ఫార్మా కంపెనీలో చేరింది. హారిక తండ్రి తాపీమేస్త్రీగా పనిచేస్తూ కష్టపడి కుమార్తెను చదివించారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయారు.

ఫార్మా కంపెనీలో ట్రైనీగా చేరిన హారిక ల్యాబ్లో పని చేస్తున్న సమయంలో రియాక్టర్ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందింది. అంతకు ముందు రెండు రోజుల సెలవులపై పరీక్షలు రాసేందుకు ఇంటికి వచ్చిన హారిక పరీక్షలు ముగించుకుని బుధవారం కాకినాడనుంచి తిరిగి కంపెనీకి వెళ్ళింది. హారిక విధుల్లో ఉండగా మధ్యాహ్నం రియాక్టర్‌ పేలడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నానమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కాకినాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదే ప్రమాదంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. ఇతను గత ఐదేళ్లుగా ఎసెన్సియా కంపెనీ ప్రొడక్షన్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. ఈ నిరుపేద కుటుంబానికి సతీశ్ జీతమే ఆధారం. కుమారుడి మృతితో ఆ ఆధారం కోల్పోయిన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.