AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి.!

Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి.!

Anil kumar poka
|

Updated on: Aug 26, 2024 | 8:41 AM

Share

వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల సమస్య అందరిలో పెరుగుతోంది. వృద్ధులే కాదు.. పిల్లలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. క్రమశిక్షణలేని ఆహార అలవాట్లు, అనియంత్రిత జీవనశైలి ఈ వ్యాధికి మూల కారణం. జన్యుపరమైన కారణాల వల్ల కూడా చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతుంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. గుండె జబ్బుల నివారణకు బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి.

వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల సమస్య అందరిలో పెరుగుతోంది. వృద్ధులే కాదు.. పిల్లలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. క్రమశిక్షణలేని ఆహార అలవాట్లు, అనియంత్రిత జీవనశైలి ఈ వ్యాధికి మూల కారణం. జన్యుపరమైన కారణాల వల్ల కూడా చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతుంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. గుండె జబ్బుల నివారణకు బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. నూనె, నెయ్యి తినాలనే తాపత్రయం తగ్గించుకోవాలి. బదులుగా రోజుకు 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరిగా చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆహారంలో కొన్ని కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూల్‌లో అస్పరాప్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా అనేక సంక్లిష్ట వ్యాధులను నివారించవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా టమాటా తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయి.
అలాగే గుండె ఆరోగ్యం కోసం చిలగడదుంపలను కూడా తినాలి. వీటిల్లో ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని అనేక అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ వెజిటబుల్స్ తప్పక తినాలి. ఈ కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లను అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు దూరమవుతాయి. కూరగాయలలో ఉండే పీచు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఈ కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.