కాకతీయ యూనివర్సిటీలో నల్లనాగు హల్ చల్ వీడియో
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో నల్ల నాగు హల్‌చల్ చేసింది. హాస్టల్ ఆవరణలోకి ప్రవేశించిన పాము దాదాపు రెండు గంటల పాటు విద్యార్థినులను వణికింపగొట్టింది. చివరికి స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టి బంధించడంతో విద్యార్థులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
అపరిశుభ్రత కారణంగా పాములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. విషపురుగులు ఏకంగా హాస్టల్ గదుల్లోకి తొంగి చూస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలా నాగుపాము గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశించింది. దాదాపు రెండు గంటల పాటు హాస్టల్ ఆవరణలో పాము హల్‌చల్ చేసింది. గర్ల్స్ హాస్టల్లోని ఈ బ్లాక్‌లోకి పాము ప్రవేశించింది. దీంతో అడలి పోయిన విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన వార్డెన్ హాస్టల్ సిబ్బందిని స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. సకాలంలో హాస్టల్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్స్ దాదాపు అరగంట పాటు శ్రమించి ఆ పామును పట్టి బంధించారు.
వైరల్ వీడియోలు
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

