బీటెక్ స్టూడెంట్ ప్యాంట్ జేబులో బాంబులా పేలిన సెల్‌ఫోన్ వీడియో
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి లేరంటే నమ్మలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి ఇలా ఏ తేడా లేకుండా అందరికీ అవసరంగా మారింది సెల్ ఫోన్. ఎక్కడ, ఎప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ లేదా ఏదో ఒక ఫోన్ తప్పక ఉండే ఉంటుంది. అయితే దాదాపుగా చాలామంది ప్యాంట్ జేబుల్లోనే మొబైల్స్ పెట్టుకుంటూ ఉంటారు.
ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? కానీ అలా ప్యాంట్ జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ బాంబులా పేలింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ సంఘటన. మే 22 గురువారం రోజున మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రాయచోటికి చెందిన విద్యార్థి ధనుజ్ కురబలకోట మండలం అంగుళ్ళలోని మిట్స్ కళాశాలలో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్యాంట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైరల్ వీడియోలు

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
