ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి

Updated on: Aug 30, 2025 | 1:44 PM

వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు పూజలందుకునేందుకు ఆ లంబోదరుడు వివిధ రూపాలలో కొలువుదీరాడు. పర్యావరణ హితం కోరి పలుచోట్ల భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తే.. కొందరు వివిధ రకాల వస్తువులతో, భిన్న రూపాలలో తీర్చిదిద్దారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది.

ఎందుకంటే ఈ గణపతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో తీర్చిదిద్దారు. కదంబ కుసుమ ప్రియా అని లలితా అమ్మవారిని స్తుతిస్తాం.. అంతేకాదు ఈ పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పురాణాల్లోనూ ఈ కదంబ వృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఎన్నో ఔషధాలు కలిగిన మొక్కగానూ ఈ కదంబ వృక్షానికి పేరుంది. తెల్లని తెలుపుతో ఈ పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చని రంగుతో బంతుల మాదిరిగా ఉంటాయి. క్రమంగా పసుపుపచ్చగా మారి, చివరిగా తెలుపు వర్ణంతో పూబంతిలా మారుతుంది. ఈ పుష్పం ఆకారంలోనే కాదు సువాసనలోనూ ప్రత్యేకమైనవే. వర్షాకాలంలో ఎక్కువగా విరగబూసే ఈ పూలు లక్ష్మీ పూజలో ప్రధానంగా నిలుస్తాయి. అంతటి విశిష్టమైన కదంబ పూలతో వినాయకుని రూపొందించి పూజలు చేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామ ప్రజలు. ఉద్దానం యూత్ క్లబ్‌ వారు ఏటా భిన్న రూపాలలో గణపతిని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాది కదంభం పుష్పాలతో తీర్చిదిద్దిన గణనాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు. MLC నర్తు రామారావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. యూత్ క్లబ్ కు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి దీనిని రూపొందించారు. గ్రామ యువత ఉత్సాహంతో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేదికను విద్యుద్దీపాలతో రంగురంగులుగా అలంకరించారు. ఎంతో విశిష్టమైన కదంబ పుష్పాలను విగ్రహానికి అద్దడం ద్వారా మరింత ఆధ్యాత్మికతను జోడించారని భక్తులు నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కదంబ వృక్షం, పుష్పం విశిష్టత, ప్రత్యేకత అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ నీ ఏర్పాటు చేయటంతో భక్తులు వాటి విశిష్టతను చదివి తెలుసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

బంగారం వదిలేసి కొత్త బాట పట్టిన తమిళనాడు స్మగ్లర్లు

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. సూర్యరశ్మితో ఇంధనం తయారీ!

సెల్ఫీ డెత్‌ రేటింగ్‌లో ఇండియా టాప్‌

ఆ పత్రిక పేరునే.. తెలుగుదేశం పార్టీకి పెట్టారా?