తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్ సింగర్
ఒక్కసారిగా వచ్చిన ఫేమ్, డబ్బుతో గర్వం తలకెక్కిందని అంటున్నాడు కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్. అదే తన కొంప ముంచిందని వాపోయాడు. అయితే ఆ తర్వాత విమర్శలతో తత్వం బోధపడిందట.
ఒక్కసారిగా వచ్చిన ఫేమ్, డబ్బుతో గర్వం తలకెక్కిందని అంటున్నాడు కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్. అదే తన కొంప ముంచిందని వాపోయాడు. అయితే ఆ తర్వాత విమర్శలతో తత్వం బోధపడిందట. పేటెంట్ హక్కులు, రెమ్యునరేషన్ అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అటుపై కాస్త డబ్బు చేతిలో పడడంతో సాధారణ జీవనానికి బై చెప్పి.. పోష్ లుక్‌తో కొన్ని ఈవెంట్లలో కాస్త తలపొగరు ఆటిట్యూడ్‌తో కనిపించాడు. దీంతో భూబన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘నేనొక సెలబ్రిటీని అనుకోవడం కంటే.. ఇప్పటికీ నేనొక పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా అనుకోవడమే మంచిది. సడన్‌గా వచ్చిన పేరు, డబ్బు నన్ను పైకి తీసుకెళ్లాయి. నాశనం చేయాలని ప్రయత్నించాయి. ఆ రంగు, హంగులు చూసి నాకు గర్వం తలకెక్కింది. కానీ, ఇప్పుడు నేలకు దిగొచ్చా. వాస్తవమేంటో అర్థం చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెకండ్ హ్యాండ్ కారు కొని.. యాక్సిడెంట్‌కు గురైన కచ్చా బాదమ్ సింగర్ భూబన్.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్ చేస్తున్నభూబన్.. సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అంటున్నాడు.
Also Watch:
జిమ్ చేస్తూ మహిళ మరణం !! ఆమెది గుండెపోటు కాదట !! ఇదీ కారణం
Samantha: అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సమంత కొత్త పోస్ట్
Samantha: మాజీ మరిదిని ఢీకొంటున్న సమంత !!
ఒకే రోజు 30 మందికి ప్రాణం పోసిన మహేష్ !! సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్
RRR New Record: ఇక RRR రికార్డును ఎవరూ అందుకోలేరుపో !!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

