Glories Tree: చింత చెట్టు కాదు.. చింతల తీర్చే చెట్టు..! ఒక్కసారి అలా చేస్తే రోగాలు మాయం..
ఈ చింత చెట్టుకు వందల సంవత్సరాల చరిత్ర.. ఈ చెట్టు కింది బాగానా.. భారీ రంద్రం.. ఈ చెట్టు నుంచి మనషులు దాటాలంటే చాలా కష్టం.. అయితే ఈ చెట్టుకు మహిమ ఉందని.. చెట్టు మధ్య నుంచి.. అటు.. ఇటు వెళ్తున్నారు. ఇలా చెట్టు మధ్యలో నుంచి.. దూరి వెళ్తే మంచి జరుగుతుందని జనం నమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇక్కడ భక్తుల సందడి భారీగా ఉంటుంది.. తెలంగాణలో ఉన్న ఈ ఆధ్యాత్మిక చెట్టుకు పెద్ద చరిత్రనే ఉంది.
ఈ చింత చెట్టుకు వందల సంవత్సరాల చరిత్ర.. ఈ చెట్టు కింది బాగానా.. భారీ రంద్రం.. ఈ చెట్టు నుంచి మనషులు దాటాలంటే చాలా కష్టం.. అయితే ఈ చెట్టుకు మహిమ ఉందని.. చెట్టు మధ్య నుంచి.. అటు.. ఇటు వెళ్తున్నారు. ఇలా చెట్టు మధ్యలో నుంచి.. దూరి వెళ్తే మంచి జరుగుతుందని జనం నమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇక్కడ భక్తుల సందడి భారీగా ఉంటుంది.. తెలంగాణలో ఉన్న ఈ ఆధ్యాత్మిక చెట్టుకు పెద్ద చరిత్రనే ఉంది. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసు నగర్ గ్రామ అటవీ ప్రాంతంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు మధ్యలో నుంచి చిన్న పిల్లలను, పెద్ద వాళ్ళను దూర్చితే వారి రోగాలు మటుమాయం అవుతాయని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి జనం చెట్టును దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈ చెట్టు ను దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో అరుదైన మూలికలు ఉన్నాయనీ స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఆహ్లాదకారమైన వాతావరణం దర్శనమిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అరుదైన పక్షులు విహరిస్తూ.. అక్కడికి వచ్చే భక్తులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ చెట్టు పక్కనే సోమిడి గండి కాల్వ పారుతుంది. వర్షాకాలంలో సోమిడి గండి కాల్వ నీటి ప్రవాహంలో స్నానాలు ఆచరించి.. చింత చెట్టుకు పూజలు చేస్తుంటారు భక్తులు. అంతేకాదు చెట్టు మొదట్లో నుంచి పిల్లలను ఐదు సార్లు అటు.. ఇటు పంపిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. అలా పిల్లలను ఆ చింతచెట్టు మధ్యలో నుంచి పంపిండం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని స్థానికుల విశ్వాసం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..