Elephant Attacks: ఏనుగుకి ఎందుకు కోపం వస్తుంది..? భార్య ఏనుగుకు దూరం అయితే ఆ మాత్రం ఉంటది...

Elephant Attacks: ఏనుగుకి ఎందుకు కోపం వస్తుంది..? భార్య ఏనుగుకు దూరం అయితే ఆ మాత్రం ఉంటది…

Anil kumar poka

|

Updated on: Sep 07, 2023 | 9:59 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు భీభత్సంతో హడలెత్తిపోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది ఏనుగుల గుంపు. నిన్న మొన్నటి వరకు ఎనిమిది ఏనుగుల గుంపు కలిసికట్టుగా సంచరిస్తే ఇప్పుడు ఆ గుంపు నుండి హరి అనే ఏనుగు విడిపోయి గుంపునకు దూరంగా ఉంటుంది. నిత్యం తమతో ఉండే ఏనుగు ఒక్కసారిగా దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు భీభత్సంతో హడలెత్తిపోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది ఏనుగుల గుంపు. నిన్న మొన్నటి వరకు ఎనిమిది ఏనుగుల గుంపు కలిసికట్టుగా సంచరిస్తే ఇప్పుడు ఆ గుంపు నుండి హరి అనే ఏనుగు విడిపోయి గుంపునకు దూరంగా ఉంటుంది. నిత్యం తమతో ఉండే ఏనుగు ఒక్కసారిగా దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులు మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిది ఏనుగుల గుంపులో ఒక మగ ఏనుగు ఉండగా, మిగతా ఏనుగులు అన్నీ ఆడవే. అందులోని రెండు ఏనుగులు గర్భం దాల్చాయి. అలా ఆడ ఏనుగులు గర్భం దాలిస్తే.. సంతానోత్పత్తి వరకు మగ ఏనుగు వాటికి దూరంగా ఉంటుంది. గర్భం దాల్చిన తరువాత సుమారు మూడు వందల రోజుల అనంతరం సంతానోత్పత్తి జరుగుతుంది. ఈ క్రమంలోనే దూరమైన ఏనుగు తిరిగి సంతానోత్పత్తి సమయంలో మాత్రమే గుంపులోకి కలుస్తుంది. ఇలా గుంపునకు దూరమైన ఏనుగు ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటూ తీవ్ర వేధనకు గురవుతుంది. తమ ఏనుగుల గుంపును గుర్తు చేసుకుంటూ రెచ్చిపోయి ఘీంకారాలు చేస్తూ.. గ్రామాలపై పడుతుందంటున్నారు నిపుణులు. అందుకే కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో ఏనుగు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటున్నారు. జనం బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. మరోవైపు అటవీ అధికారులు ప్రత్యేక ట్రాకర్లు ఏర్పాటు చేసిన ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..