Consumer forum: ఒక్క బిస్కెట్ తగ్గిందని.. రూ. లక్ష పెనాల్టీ కట్టిన సన్ ఫీస్ట్..
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి వీధి శునకాలకు పెట్టడానికి సన్ ఫీస్ట్ మ్యారీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఒక బిస్కెట్ తక్కువగా ఉంది. దుకాణం దగ్గరకి వెళ్లి అడగగా సరైన సమాధానం రాలేదు. దీంతో నేరుగా ఐటీసీ కంపెనీని సంప్రదించాడు. అక్కడా.. సరైన సమాధానం రాకపోవడంతో వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయింది.
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి వీధి శునకాలకు పెట్టడానికి సన్ ఫీస్ట్ మ్యారీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఒక బిస్కెట్ తక్కువగా ఉంది. దుకాణం దగ్గరకి వెళ్లి అడగగా సరైన సమాధానం రాలేదు. దీంతో నేరుగా ఐటీసీ కంపెనీని సంప్రదించాడు. అక్కడా.. సరైన సమాధానం రాకపోవడంతో వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ డిల్లిబాబు 2021, డిసెంబర్‌లో ఈ బిస్కెట్ ప్యాకెట్లను కొన్నాడు. ప్యాకెట్‌పై 16 బిస్కెట్లు అని రాసుండగా లోపల మాత్రం 15 వచ్చాయి. దీంతో వినియోగదారుల ఫోరానికి ఇచ్చిన ఫిర్యాదులో కంపెనీ ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో వివరించాడు డిల్లీబాబు. ఒక బిస్కెట్ తయారీకి అయ్యే ఖర్చు 75 పైసలుగా అంచనా వేశాడు. దీని ప్రకారం కంపెనీ రోజుకు 50 లక్షల బిస్కెట్లు తయారు చేస్తుందనుకుంటే.. ప్యాకెట్లో ఒక బిస్కెట్ చొప్పున.. ఏకంగా రోజుకు 29 లక్షల రూపాయలు ఆదా చేస్తోంది. అంటే ప్రభుత్వానికి ఖర్చు అయినట్లు చూపించి ప్రజల నుంచి ఆ సొమ్మును దోచుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఢిల్లీబాబు. ఇక దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం కంపెనీ వివరణ కోరింది. బిస్కెట్ల సంఖ్య బట్టి కాదని, వాటి బరువును బట్టి ప్యాకింగ్ ఉంటుందని తెలిపింది సదరు కంపెనీ. దీంతో 15 బిస్కెట్లను తూకం వేయగా.. అవి 74 గ్రాములు ఉన్నాయి. కానీ ప్యాకెట్‌పై కంపెనీ 76 గ్రాములుగా పేర్కొంది. దీంతో కంపెనీ సమాధానం కూడా వీగిపోయింది. విచారించిన కన్జ్యూమర్ కోర్టు కంపెనీకి లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు తక్కువ బిస్కెట్లు ప్యాకింగ్ చేసిన వాటి విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..