Isha Ambani – Reliance Retail: రిలయన్స్ రిటైల్ రారాణిగా ఈశా అంబానీ..? త్వరలో అధికారిక ప్రకటన ..?
ఈశా అంబానీ రిలయన్స్ రిటైల్ బాధ్యతలు చేపట్టబోతుందా? అంటే అవుననే అంటున్నాయి రిలయన్స్ వర్గాలు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపాయి. కాగా..
ఈశా అంబానీ రిలయన్స్ రిటైల్ బాధ్యతలు చేపట్టబోతుందా? అంటే అవుననే అంటున్నాయి రిలయన్స్ వర్గాలు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపాయి. కాగా.. తన వారసులకు నాయకత్వ బదిలీ విషయంలో ముకేశ్ అంబానీ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గతంలో తన సోదరుడు అనిల్ అంబానీ, తనకు మధ్య తలెత్తిన వివాదాల తరహాలో తన పిల్లల మధ్య ఎలాంటి తగువూ లేకుండా వ్యూహం అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం రిలయన్స్ జియో ఛైర్మన్ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు.ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తిచేసిన ఈశా అంబానీ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. యేల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. కొన్ని నెలల పాటు మెకన్సీ అండ్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు.తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన ఈశా రిలయన్స్ వ్యాపారంలోకి ప్రవేశించారు. 2016లో రిలయన్స్ రిటైల్‌కు అనుంబంధంగా అజియో (Ajio) అనే ఫ్యాషన్ ఆన్‌లైన్ రిటైల్‌ను ప్రారంభించారు. 2018 డిసెంబరులో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..