Indian Submarine: భారత సముద్ర జలాల్లోకి అణు సబ్‌మెరైన్‌లు.! ఆ దేశాల కంటే కంటే చిన్నవి.
భారత్ అణుశక్తిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. తాజాగా ఆగస్ట్ 29న రెండో అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను జాతికి సమర్పించింది. ఈ సమయంలో మూడో జలాంతర్గామి విషయం వార్తల్లోకి వచ్చింది. ఐఎన్‌ఎస్ అర్ధమాన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలాంతర్గామిని మరో ఆరు నెలల్లో నౌకాదళ అమ్ములపొదిలోకి చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సముద్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు.
భారత్ అణుశక్తిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. తాజాగా ఆగస్ట్ 29న రెండో అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను జాతికి సమర్పించింది. ఈ సమయంలో మూడో జలాంతర్గామి విషయం వార్తల్లోకి వచ్చింది. ఐఎన్‌ఎస్ అర్ధమాన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలాంతర్గామిని మరో ఆరు నెలల్లో నౌకాదళ అమ్ములపొదిలోకి చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సముద్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్ కంటే మూడో అణు సబ్‌మెరైన్ మరింత పెద్దది కావడం విశేషం. ఐఎన్‌ఎస్ అర్ధమాన్‌తోపాటు మరో అణు జలాంతర్గామిని కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 125 మీటర్ల పొడవు, 7,000 టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్ బరువుతో తయారుచేస్తున్నారు. వీటిల్లో గత రెండు సబ్‌మెరైన్ల కంటే అధికంగా కే-4 క్షిపణులను తీసుకెళ్లవచ్చు.
1990లో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సల్ ప్రాజెక్టులో భాగంగా ఈ నాలుగు జలాంతర్గాములను నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.90,000 కోట్లు పైమాటే. వాస్తవానికి అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాముల కంటే ఇవి చిన్నవి. చైనా వినియోగించే ఆరు జిన్ శ్రేణి జలాంతర్గాములకి జేఎల్-3 క్షిపణులను అమర్చారు. ఇవి 10వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఆగస్ట్ 29న జాతికి అంకితం చేసిన అరిఘాత్ నిర్మాణాన్ని విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబరు 19న జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.