Vistara Aircraft: సెప్టెంబర్ 3 నుంచి బుకింగ్స్ బంద్.. నవంబర్ 11న విస్తారా లాస్ట్ ఫ్లైట్.!
నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడపనుంది. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు నిలిచిపోనున్నాయి. అయితే నవంబర్ 11 వరకు మాత్రం విస్తారా కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సదరు కంపెనీ తెలిపింది. నవంబరు 12 నుంచి విస్తారాకు చెందిన విమానాలన్నీ ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే నడుస్తాయి. బుకింగ్‌లు సైతం ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచే జరగనున్నాయి.
నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడపనుంది. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు నిలిచిపోనున్నాయి. అయితే నవంబర్ 11 వరకు మాత్రం విస్తారా కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సదరు కంపెనీ తెలిపింది. నవంబరు 12 నుంచి విస్తారాకు చెందిన విమానాలన్నీ ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే నడుస్తాయి. బుకింగ్‌లు సైతం ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచే జరగనున్నాయి.
ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు అనుమతి ఇచ్చింది. ఈ విలీనం పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి 2022 నవంబర్లోనే ఎయిర్ ఇండియా, విస్తారా విలీనాన్ని ప్రకటించాయి. విస్తారా అనేది టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ.
తమ సంస్థలో సింగపూర్ ఎయిర్ లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఎయిర్ ఇండియా స్వాగతించింది. ఇది విస్తారా, ఎయిర్ ఇండియా మధ్య విలీన ప్రక్రియను మరింత సులభతరం చేసే ఒక ముఖ్యమైన మైలురాయి అని తెలిపింది. ఎయిర్ ఇండియా, విస్తారా క్రాస్-ఫంక్షనల్ టీమ్స్ చాలా నెలలుగా కలిసి పనిచేస్తున్నాయనీ ఎయిర్‌క్రాఫ్ట్, ఫ్లయింగ్ సిబ్బంది, గ్రౌండ్ బేస్డ్ సహోద్యోగులు కలిసి కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కష్టపడుతున్నట్లు ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

