IndiGo: ఇండిగో కి రూ.1.2 కోట్ల జరిమానా.! ఎందుకంటే.? వీడియో.

IndiGo: ఇండిగో కి రూ.1.2 కోట్ల జరిమానా.! ఎందుకంటే.? వీడియో.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2024 | 8:40 PM

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS సీరియస్ అయ్యింది. ఈ నిర్వాకానికి పాల్పడిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు భారీగా జరిమానా విధించింది. ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS సీరియస్ అయ్యింది. ఈ నిర్వాకానికి పాల్పడిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు భారీగా జరిమానా విధించింది. ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది. ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవి కాస్తా వైరల్ కావడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో తాజాగా జరిమానా విధించింది.

ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ DGCA, బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ BCAS 1.50 కోట్లు జరిమానా విధించాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు కూడా 90 లక్షలు జరిమానా వేశాయి. DGCA, ఇరు సంస్థలకు చెరో 30 లక్షల చొప్పున జరిమానా వేయంగా.. BCAS ఇండిగోకు 1.20 కోట్లు, ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు 60లక్షలు చొప్పున జరిమానా విధించింది. యాక్టివ్‌ ఆప్రాన్‌లో అధిక సమయం ప్రయాణికులు ఆరు బయట ఉండడం నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా DGCA పేర్కొంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఓ విమానయాన సంస్థకు జరిమానా విధించడం ఇదే తొలిసారి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 19, 2024 07:06 PM