ప్రయాణికులకు వింత అనుభూతి.. నీటి అడుగున మెట్రో పరుగులు

|

Jan 11, 2023 | 9:18 AM

మెట్రో రైలు పరుగులు ఇక కొత్త అనుభూతిని కలిగించనున్నాయి. దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో ట్రైన్ నడిపేలా కసరత్తు జరుగుతోంది.

మెట్రో రైలు పరుగులు ఇక కొత్త అనుభూతిని కలిగించనున్నాయి. దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో ట్రైన్ నడిపేలా కసరత్తు జరుగుతోంది. ఇండియాలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కోల్‌కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ ప్రకటించారు. కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మిస్తున్నారు. ఆ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందించనుంది. లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీసు మాదిరిగా రూపుదిద్దుకొంటున్న ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగుపై స్వారీ చేస్తున్న వ్యక్తిపై పెద్దపులి దాడి.. షాకింగ్ వీడియో

మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా

కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్‌ వీడియో

ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

 

Published on: Jan 11, 2023 09:18 AM