మొసలికే చుక్కలు చూపించిన శునకం.. పారిపోతున్నా వదల్లేదుగా
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసళ్లను ఒకటిగా పరిగణిస్తారు. సాధారణంగా మొసలిని చూడగానే అందరూ దూరంగా పారిపోతారు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసళ్లను ఒకటిగా పరిగణిస్తారు. సాధారణంగా మొసలిని చూడగానే అందరూ దూరంగా పారిపోతారు. అలాగే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా వాటి జోలికి వెళ్లడానికి భయపడతాయి. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ కుక్క మొసలికే చుక్కలు చూపించింది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఓ ప్రదేశంలో చిన్నసైజు మొసలి ఒకటి ఉంది. పైగా దాని నోరు కట్టేసి ఉంది. అది అక్కడికి ఎలా వచ్చింది? దాని నోరు ఎందుకు కట్టేసి ఉంది అనేది పక్కన పెడితే.. ఈ మొసలిని ఓ వీధి కుక్క చూసింది. వెంటనే దానిమీద దాడి చేసింది. పాపం మొసలి నోరు కట్టేసి ఉండటంతో రివర్స్ ఎటాక్ చేయలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్ వీడియో
ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుత సృష్టి.. చూస్తే వావ్ అనకమానరు