AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేయని హత్యకు 43 ఏళ్లు జైలు..రిలీజయ్యాక కొత్త కష్టాలు

చేయని హత్యకు 43 ఏళ్లు జైలు..రిలీజయ్యాక కొత్త కష్టాలు

Phani CH
|

Updated on: Oct 18, 2025 | 4:21 PM

Share

చేయని నేరానికి అమెరికాలోని పెన్సిల్వేనియా జైలులో 40 ఏళ్లకు పైగా శిక్షను అనుభవించారు భారత సంతతి వ్యక్తి సుబ్బు వేదం. ఎట్టకేలకు విడుదలైన అతన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి అదుపులోకి తీసుకుని భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తొమ్మిది నెలల బాలుడిగా అమెరికాలోకి అడుగుపెట్టిన తాను..అమెరికాలో శాశ్వత నివాసినని, ఇండియాలో తనకంటూ ఎవరూ లేరని, తనను డిపోర్ట్ చేయవద్దని సుబ్సు అధికారులకు మొరపెట్టుకున్నారు.

జైలు కాలంలో.. సుబ్బు దిగులు పడుతూ గడపలేదు. తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల పెన్సిల్వేనియా జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన థామస్‌ కిన్సర్‌ కాల్చివేత కేసులో అరెస్టయిన సుబ్బు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు కోర్టులు దోషిగా నిర్ధారించాయి. పెరోల్‌ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. కాగా, 2025 ఆగస్ట్‌ లో, ఓ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేసారు. సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన సుబ్బు.. చేయని తప్పుకు నాలుగు దశాబ్దాల జీవిత కాలాన్ని కోల్పోయారు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని భారత దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్‌కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం? అని వేదం తరపు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. సుబు మేనకోడలు జోయ్‌ మిల్లర్‌ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్నాయి. ‘ అకారణంగా మా మామయ్యను 43 ఏళ్ల పాటు జైలులో వేసి.. ఆయన బతుకు బుగ్గి చేశారు. ఇప్పుడు.. తనకంటూ ఎవరూ లేని చోటికి ఆయనను పంపుతూ మరో తప్పు చేస్తున్నారు. దయచేసి, ఇకనైనా.. మా కుటుంబాన్ని కలవనివ్వండి’ అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసుకుంటున్నారా ?? ఈ స్టోరీ చూడాల్సిందే

దీపావళి తరువాత వెండి ధర పెరుగుతుందా? తగ్గుతుందా?

ఉపరితల ఆవర్తనంతో ఏపీ,తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

TOP 9 ET News: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో