Lottery: అదృష్టమంటే ఇతడిదే..! ఫ్రీ లాటరీ టికెట్‌తో కోట్లు వచ్చి పడ్డాయి!

|

Feb 12, 2024 | 9:45 AM

కొంతమందికి అదృష్టం భలే కలిసొస్తుంటుంది. కొందరి జీవితాలు ఊహించని విధంగా మారుతుంటాయి. అనూహ్యంగా ఓ భారతీయుడి కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో భారతీయ వలసదారు రాజీవ్ అరికట్టి 34 కోట్ల రూపాయల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. రాజీవ్ ప్రస్తుతం అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నాడు. తన భార్య, పిల్లలపై లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

కొంతమందికి అదృష్టం భలే కలిసొస్తుంటుంది. కొందరి జీవితాలు ఊహించని విధంగా మారుతుంటాయి. అనూహ్యంగా ఓ భారతీయుడి కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో భారతీయ వలసదారు రాజీవ్ అరికట్టి 34 కోట్ల రూపాయల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. రాజీవ్ ప్రస్తుతం అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నాడు. తన భార్య, పిల్లలపై లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈసారి మాత్రం అదృష్టం వరించింది. ఏకంగా రూ.34 కోట్లు గెలుచుకున్నాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాజీవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్‌ గత మూడేళ్లుగా బిగ్‌ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. బిగ్‌ టికెటుపై స్పెషల్‌ ఆఫర్‌ వచ్చింది. రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాను. 7, 13 నంబర్లతో ఉన్న టికెట్లు కొన్నాననీ అవి తన పిల్లల పుట్టినరోజు తేదీలు అని రాజీవ్‌ తెలిపారు. లాటరీ గెలుచుకొన్నట్లు తన పేరు ప్రకటించగానే పట్టరాని సంతోషం కలిగిందని, మూడేళ్లలో మొదటిసారి అదృష్టం కలిసివచ్చిందన్నారు. తనతోపాటు లాటరీ తన వాళ్లందరి జీవితాలను మార్చిందనీ తను గెలుచుకున్న 15 మిలియన్ల దర్హమ్‌లు ఎలా ఖర్చు పెట్టాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ చెప్పారు. డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకొంటున్నానని రాజీవ్‌ తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..