భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??
అంతరించి పోతున్న జాతుల జాబితాలోకి చేరిన చీతాలు మన దేశంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక బోయింగ్ విమానంలో చీతాలు భారత్‌కు రాబోతున్నాయి.
అంతరించి పోతున్న జాతుల జాబితాలోకి చేరిన చీతాలు మన దేశంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక బోయింగ్ విమానంలో చీతాలు భారత్‌కు రాబోతున్నాయి. భారత్‌లో తిరిగి చీతాలను పెంచే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా 100కి పైగా చిరుతలను తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. గత సెప్టెంబరులో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను ప్రత్యేక బోయింగ్ విమానంలో సెప్టెంబరు 17న తీసుకొచ్చారు. ఫిబ్రవరి నెలలో మరో 12 చిరుతలను భారత్‌కు తరలించనున్నట్లు దక్షిణాఫ్రికా పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చీతాల సంతతిని అభివృద్ధి చేయడం కోసం ఏడాదికి 12 చొప్పున వచ్చే ఎనిమిది నుంచి పదేళ్లలో వీటిని భారత్‌కు తరలించనున్నట్టు వెల్లడించింది. ఒకప్పుడు ఆసియా చీతాలకు కేంద్రంగా భారత్‌లో 1948లో ఉమ్మడి మధ్యప్రదేశ్‌లోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో 1952లో అంతరించిన జాతిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వన్య ప్రాణుల సంరక్షకుల కృషి.. కేంద్ర ప్రభుత్వం చొరవతో నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తెప్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!
మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!
18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..