8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!
హర్యానా రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. సీనియర్ ఐఏఎస్ అధికారి. దేశం వ్యాప్తంగా ఈయన పేరు తెలియనివారు ఉండరు.
హర్యానా రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. సీనియర్ ఐఏఎస్ అధికారి. దేశం వ్యాప్తంగా ఈయన పేరు తెలియనివారు ఉండరు. 1991వ బ్యాచ్‌కు చెందిన ఈయన పేరు 2012లో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీల్ మ్యుటేషన్‌ను రద్దు చేయడంతో ఒక్కసారిగా దేశమంతా మారుమ్రోగిపోయారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో 56 సార్లు బదిలీ కావడం గమనార్హం. తాజాగా, అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. తాను తీసుకునే జీతానికి, చేసే పనికి పొంతన లేదని, పని ఎక్కువగా ఉండే శాఖకు బదిలీ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న ఆయన.. విజిలెన్స్‌కు పంపాలని తన లేఖలో కోరారు. అయితే, రోజులో 8 నిమిషాలుండే పనికోసం తనకు ఏడాదికి 40 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని.. అవినీతిని నిర్మూలించేందుకు తనకు విజిలెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న ఆయనను అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు ఇటీవల బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!
18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

