Crocodile Snatching Shark: తరచూగా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌కు గురిచేస్తే.. మరికొన్ని నవ్వును తెప్పిస్తుంటాయి. అదే సమయంలో అలాంటి వీడియోలు కూడా నెటిజన్లు పోస్ట్ చేస్తుంటారు. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాట్ బర్న్స్ పశ్చిమ తీరంలో చేపలు పట్టడం మొదలు పెట్టాడు ఆస్ట్రేలియాకు చెందిన జియోఫ్ ట్రూట్విన్. అయితే అతను వేసిన గాలంకు ఒక సొరచేప పడింది. కానీ, అతను సొరచేపను తన వైపుకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి ఎంట్రీ ఇచ్చింది. తాను వేటాడిన సొరచేపపై మధ్యలో ఆ మొసలి దాడి చేసింది. అతను మొసలి నుండి సొరచేపను లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు విజయం సాధించలేదు. అతను వేటాడిన చేపను నోట పట్టుకుంది. దీంతో అతను ఆ చేపను వదలేశాడు. ఆ మొసలి సుమారు 8 అడుగుల పొడవు ఉంది.
అయితే ఈ నదిలో ఇంత పెద్ద మొసళ్లు లేవంటున్నారు. ఈ నదిలో పర్యాటకు సరదాగా చేపల వేటకు వస్తుంటారు. అక్కడ ఉండే బోటింగ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు చేపల వేట మొదలు పెడుతారు. ఇలా వేటాడిన చేపలను అదే బోట్‌లోని రోస్ట్ చేసి ఇస్తుంటారు. ఇక్కడ టూరిస్టులు చాలా ఇష్టపడుతుంటారు.