Protein Powder: ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!

ఈ రోజుల్లో యువత మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సాధారణమైంది. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లే యువత ఎక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నారు. కారణం జిమ్‌కి వెళ్లి, వర్కవుట్‌లు చేసినప్పుడు, కండరాలను నిర్మించడానికి శరీరానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ పౌడర్ వల్ల అనారోగ్యానికి గురువుతారని నిపుణులు చెబుతున్నా వందలు ఖర్చుపెట్టి పౌడర్ కొంటున్నారు.

Protein Powder: ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!

|

Updated on: May 13, 2024 | 11:51 AM

ఈ రోజుల్లో యువత మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సాధారణమైంది. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లే యువత ఎక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నారు. కారణం జిమ్‌కి వెళ్లి, వర్కవుట్‌లు చేసినప్పుడు, కండరాలను నిర్మించడానికి శరీరానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ పౌడర్ వల్ల అనారోగ్యానికి గురువుతారని నిపుణులు చెబుతున్నా వందలు ఖర్చుపెట్టి పౌడర్ కొంటున్నారు. ప్రోటీన్ పౌడర్‌ సప్లిమెంట్ల‌పై హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంకా ఐసీఎంఆర్ తాజాగా కీలక హెల్త్ అలెర్ట్ ఇచ్చింది.

ప్రొటీన్ పౌడర్లను అతిగా వాడితే మన ఎముకలలోని మినరల్స్ తగ్గుతాయని, మూత్రపిండాలు దెబ్బతినే రిస్క్ ఉందని ఎన్ఐఎన్ హెచ్చరించింది. శరీరానికి శక్తిని అందించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని శరీరానికి చక్కెరల ద్వారా అందించే కేలరీలు 5 శాతంలోపే ఉండాలని సూచించింది. తృణధాన్యాలు, మిల్లెట్ల నుంచి 45 శాతంలోపు కేలరీలను.. పప్పులు, బీన్స్, మాంసం నుంచి 15 శాతం వరకు కేలరీలను శరీరానికి అందించవచ్చు. శరీరానికి అవసరమైన మిగిలిన కేలరీలను డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, పాల నుంచి పొందాలి. శరీరానికి అందించే మొత్తం కేలరీలలో 30 శాతంలోపే కొవ్వు సంబంధిత ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు ఉండాలి. పప్పుధాన్యాలు, మాంసం ధరలు మండిపోతుండటంతో దేశ ప్రజలు ఎక్కువగా తృణధాన్యాలనే ఆహారంలో వినియోగిస్తున్నారని ఎన్ఐఎన్ తెలిపింది. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అందడం లేదు. ఫలితంగా జీవక్రియల్లో అంతరాయం ఏర్పడుతోంది. వెరసి చిన్న వయసులోనే ఎంతోమంది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతతో ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త