Charlotte Chopin: పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్.. వీడియో వైరల్.!
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వందేళ్లు దాటిన విదేశీయురాలు భారతతీయ సంప్రదాయ చీరకట్టులో వచ్చి అందిరి దృష్టినీ ఆకర్షించారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ షార్లెట్ చోపిన్ ఈ వయసులోనూ స్వయంగా నడుచుకుంటూ వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. వందేళ్లు దాటినప్పటికీ యోగా చేయడం వల్ల ఆమె ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతేడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్ చాపిన్‌ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడ అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీయగా ఆమె ఒక యోగా గురవని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్నే ఆయన మన్‌కీబాత్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడు ఈ యోగా విద్య గురించి తెలిసుకున్నారట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకున్నారట.
షార్లెట్ బాల్ రూమ్ డ్యాన్సర్‌గా కెరియర్‌ని మొదలుపెట్టారు. డ్యాన్స్ చేసేటప్పుడు గాయాలపాలైన షార్లెట్‌కు మూడుసార్లు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ జరిగింది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. అప్పట్నుంచీ యోగమార్గమే ఆమె జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా తాను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఈ బామ్మకు పాతికేళ్లే అనుకుంటారు. తన ఫిట్‌నెస్‌కి కారణం యోగానే అంటారు షార్లెట్. ఫ్రాన్స్‌లో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.