శివాలయంలో మహాద్భుతం.. శివయ్య మహిమే అంటున్న భక్తులు

|

Jul 04, 2022 | 9:16 PM

త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివయ్య లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశవిదేశాల్లో ప్రసిద్ధిచెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం మాత్రం..

త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివయ్య లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశవిదేశాల్లో ప్రసిద్ధిచెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం మాత్రం.. అమరనాథ్ లో మాత్రమే ఉంది. సహజసిద్ధంగా ఏర్పడే ఆ మహాశివుని రూపాన్ని దర్శించుకోడానికి దేశవిదేశాలనుంచి భారీ సంఖ్యలో భక్తులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని అమరనాథ్ కు చేరుకుంటారు.. అయితే తాజాగా మరో ప్రసిద్ధిచెందిన శివాయలయంలో మంచిలింగం దర్శనమిచ్చి భక్తులను ఆశ్చర్యంలో ముంచేసింది. అదంతా మహాశివుని మహిమే అంటున్నారు భక్తులు. ఈ అద్భుతమైన ఘటన మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో జరిగింది. గోదావరి నది జన్మస్తానం.. నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయంలో శివలింగానికి ముందుగా అర్చకులు బ్రహ్మ కమలం పువ్వులతో శివలింగం చుట్టూ చక్కగా అలంకరించారు. పూజలను చేశారు. అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో లింగం పై తెల్లని మంచు ఏర్పడింది.. లింగంపై మంచుని చూసిన పూజారులు, భక్తులు అంతా శివయ్య మహిమే అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: నెట్టింట వైరల్‌ అవుతున్న రామ్ చరణ్ చెర్రీ న్యూ లుక్‌

Pakka Commercial: దిమ్మతిరిగే ఓపెనింగ్స్ రాబట్టిన మాచో స్టార్ గోపీచంద్

పదే పదే ఆకలిగా అనిపిస్తుందా ?? జాగ్రత్త మీకు ఈ వ్యాధి ఉండవచ్చు

మీరు నాసాలో పని చేయాలని ఉందా.. ఈ అద్భుతమై ఛాన్స్ మీ కోసమే

Ice Pizza: నెటిజన్లకు నోరూరిస్తున్న ఐస్ పిజ్జా.. తయారీ పద్దతి వెరైటీ గురూ

 

Published on: Jul 04, 2022 09:16 PM