పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో
హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ ముఠాలు పట్టుబడినా వారి మూలాలు మాత్రం ఒక నైజీరియన్ వద్దనే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50 మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. అయితే ఎండీపీఎస్ చట్టాలలో ఉన్న లోసుగుల కారణంగా నిందితులకు ఎదర్చగా బెయిల్ వస్తుంది. దీంతో బయటకు వచ్చి మళ్ళీ షరా మామూలే అన్నట్టుగా నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో వీరిని హైదరాబాద్లో ఉంచుకోకుండా నైజీరియన్ దేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటివరకు 10 మందికి పైగానే నైజీరియన్లు హైదరాబాద్ నుండి డిపోర్ట్ చేశారు పోలీసులు. దీంతో డిపోర్టేషన్కు భయపడుతున్న నైజీరియన్లు కొత్త మార్గాలను అన్వేషించి హైదరాబాద్ వదిలి వెళ్ళకుండా ఉండేలాగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకొని ఆమె చేత హరాస్ మెంట్ కేసు పెట్టించి ఇక్కడే జైలులో ఉండేలాగా చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో కేసులు ఉండటంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. మరోవైపు డిపోర్టేషన్ సందర్భంగా నిందితులకు సంబంధించిన ఫ్లైట్ టిక్కెట్లకు సైతం హైదరాబాద్ పోలీసులే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క నైజీరియన్కు టిక్కెట్ బుక్ చేసి డిపోర్టేషన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో
వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో
మిర్యాలగూడలో మిస్ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

