వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచి వెళ్లిపోయాడు !!

వీడేం మొగుడండి బాబు.. నడిరోడ్డుపై భార్యను మరచి వెళ్లిపోయాడు !!

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 9:48 AM

మర్చిపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను ఒకటో రెండో మర్చిపోతుంటారు.

మర్చిపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను ఒకటో రెండో మర్చిపోతుంటారు. అయితే, ఎవరైనా తన భార్యను మర్చిపోవటం ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా..? అయితే, అలాంటి వింత సంఘటనే థాయ్‌లాండ్‌లోని మహాసరఖం ప్రావిన్స్‌లో జరిగింది. క్రిస్మస్ రోజున, 55 ఏళ్ల బూన్‌తోమ్ చైమూన్ తన భార్య ఎమునే చైమూన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అర్థరాత్రి దాటి తెల్లవారు జామున 3 గంటల సమయంలో బహిర్భూమి కోసం ఓ చోట కారు ఆపి ఇద్దరూ దిగారు.. ఆ తర్వాత కారు వద్దకు వచ్చిన భర్త.. భార్య కూడా కారులో ఎక్కేసింది అనుకున్నాడు. వెంటనే కార్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. అలా ఏకంగా 160 మైళ్లు ముందుకు వెళ్లాడు. ఇంతలో భయపడిపోయిన ఆ ఇల్లాలు బిక్కుబిక్కుమంటూ చీకట్లోనే 20 కిలోమీటర్లు నడిచింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ పోలీస్ స్టేషన్‌లో విషయమంతా చెప్పింది. దాంతో పోలీసులు బూన్‌తోమ్‌ను చాలాసార్లు ఫోన్‌లో సంప్రదించినప్పటికీ అతను ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో పోలీసులు ఆ మహిళ బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అప్పటికే తెల్లవారింది. కానీ భార్య లేకుండా కారు నడుపుతున్నట్లు అతడు మాత్రం గ్రహించలేదు. ఆ తర్వాత ఎలాగోలా పోలీసులు బూన్‌తోమ్‌ను సంప్రదించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..

నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!

 

Published on: Jan 07, 2023 09:44 AM