Vijayawada: చిత్రాయి చేప కోసం వెంపర్లాడుతున్న జనం.. అంత స్పెషల్ ఏంటంటే..?
ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ కలకలలాడుతూనే ఉంటుంది. ప్రాంతం ఏదైనా.. చేపల మార్కెట్ ఆదివారం మస్త్ బిజీ అవుతుంది. అయితే చాలాచోట్ల చెరువలో చేపలే దొరుకుతుంటాయి.. కానీ అక్కడ మాత్రం నదిలో దొరికే చిత్రాయి చేపకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
సండే వచ్చిందంటే.. చాలామందికి నీసు ఉండాల్సిందే. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు.. ఇలా ఎవరికి నచ్చిన ఐటమ్ వారు తెచ్చుకుని.. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో డాక్టర్ల సూచనలతో ఎక్కువమంది చేపలవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చాపలకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా చిత్రాయి చేపల కోసం కృష్ణానది కరకట్టకు క్యూ కట్టారు జనం. ఆ చేపలే కావాలంటూ ఎగబడ్డారు. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో పెద్ద మొత్తంలో చేపలు లభిస్తున్నాయి. నదిలో దొరికే చిత్రాయి చేప టేస్ట్ అమోఘం అంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో చుట్టుపక్కల నుంచి చెరువు చేపలు తెచ్చి కృష్ణా నది చేపలంటూ మరికొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చేపల్ని కిలో రూ.350 లెక్క విక్రయిస్తున్నారు మత్స్యకారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

