Watch: వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

|

Dec 16, 2024 | 11:21 AM

కొన్ని ఘటనలు అత్యంత పాశవికంగా ఉంటాయి. మనుషులేనా..? అనే భయం కలుగుతుంది. అదికూడా అభం శుభం తెలియని చిన్నారుల పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడమా.! అనే బాధ కలుగుతుంది. అచ్చం అలాంటి గుండె తరుక్కుపోయే ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. ఆ చిట్టి తల్లికి పదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కంటిపాపలా చూసుకోవాల్సిన తండ్రి చేతిలోనే తాను హతమవుతానని ఊహించి ఉండదు పాపం.

పదేళ్ల సారా షరీఫ్ లండన్‌లోని సర్రీ ప్రాంతంలో తన ఇంటిలోనే విగతజీవిగా కనిపించింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో మృతి చెందింది. చనిపోవడానికి ముందు దారుణమైన వేధింపులకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయ్యింది. చనిపోయినప్పుడు ఆ చిన్నారి ఒంటిపై మానవ పంటి గాయాలతో సహా మొత్తం 70 గాయలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. అలాగే మెడ, వెన్నుముకతో సహ మొత్తం 25 చోట్ల ఎముకలు విరిగినట్లు రిపోర్ట్‌లో తెలిపారు.

పోలీసులు సైతం ఈ ఘటనను చూసి తమ 30 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసుని చూడలేదన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ క్రెయిగ్ ఎమ్మెర్సన్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడమే గాక ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసులో అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే కన్నతండ్రి సవితి తల్లి కలిసి ఆ చిన్నారిని ఇంత ఘోరమైన బాధలకు గురిచేయడం. ఆమె బాల్యమంతా భరించలేని బాధలతోనే గడిచింది. అక్కడితో ఆగక ఆ కిరాతక తండ్రి తన రెండో భార్యతో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఇందులో ఆ చిన్నారి మేనమామ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సారా ఉదంతంతో ఒక్కసారిగా యావత్‌ ప్రపంచంలో పిల్లల సంరక్షణ ఏ స్థితిలో ఉందనే భయాందోళన రేకెత్తించింది. ఈ ఘటనతో పిల్లలు సంరక్షణకు సంబంధించిన సంస్కరణలకు పిలుపునిచ్చారు సామాజికవేత్తలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.