స్టార్‌ ఫ్రూట్స్‌ తిని చూడండి.. నమ్మలేని లాభాలు వీడియో

ఈ మధ్య కాలంలో గతంలో ఎన్నడూ చూడని ర‌కరకాల పండ్లు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒక‌టి. చెప్పిన‌ట్లుగానే న‌క్ష‌త్రం ఆకారంలో ఈ పండు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ప‌సుపు రంగులో క‌నిపించే ఈ పండు తియ్య‌గా ఉంటుంది. అందుకే చాలా మంది స్వీట్స్‌ తయారీలో వాడుతుంటారు.

Follow us
Samatha J

|

Updated on: Feb 03, 2025 | 9:00 PM

అనేక పోషకాలు కలిగిన స్టార్ ఫ్రూట్స్‌ ఆరోగ్య ప‌రంగా అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క్యాలరీలు తక్కువగా ఉండే స్టార్‌ ఫ్రూట్స్‌ బెస్ట్ ఆప్ష‌న్. ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌ల‌బ‌ద్ధకం త‌గ్గుతుంది. స్టార్ ఫ్రూట్‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు, జ‌లుబు నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే ఈ పండ్ల‌లోని విట‌మిన్ సి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!

రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో

ఖర్జూరంతో అరటిపండును కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

భూమి తిరగడాన్ని చూశారా? వీడియో