Gun Culture: ముంబైలో గన్ కల్చర్.. నడిరోడ్డుపై కాల్పులతో వీరంగం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
ముంబైలో కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబై సమీపంలోని ఓ వీధిలో పట్టపగలు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఎద్దుల బళ్ల పోటీలో చెలరేగిన వివాదం కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది.
అంబర్‌నాథ్‌లో ఎద్దుల బండ్ల రేస్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాద తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు వాగ్వాదానికి దిగి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది. నడిరోడ్డుపై అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు కాల్పులకు దిగారు. గన్ చేత ధరించి గాల్లో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు పార్క్ చేసిన వాహనాల మాటున దాక్కున్నారు. మరికొందరు ప్రాణభయంతో పరుగులు తీసారు. కాగా ఘటనపై సమాచారం అందుకున్న శివాజీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos