Viral Video: జేసీబీలో పెళ్లి ఊరేగింపు.. ఏం ఐడియా గురూ.! వరుడి ఐడియాకి నెటిజన్లు ఫిదా..

|

May 08, 2023 | 9:52 PM

గంగాధర్​ బెహరా అనే వ్యక్తికి సరస్వతి బెహరాతో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఊరేగింపు వెరైటీగా జేసీబీలో చేయాలని భావించాడు పెళ్లికొడుకు గంగాధర్​. ఇందుకోసం జేసీబీ ఆపరేటర్​గా పనిచేస్తున్న తన తమ్ముడిని సంప్రదించాడు. దీంతో అతడు జేసీబీ ముందు

సాధారణంగా పెళ్లికొడుకును పల్లకిలోనో.. కారులోనో తీసుకొస్తారు. కానీ ఒడిశాలో మాత్రం ఓ వరుడిని వినూత్నంగా జేసీబీలో తీసుకొచ్చారు. ఈ వింత సంఘటన బౌద్​ హర్భంగా బ్లాక్​లోని ఛతరంగ గ్రామంలో జరిగింది. గంగాధర్​ బెహరా అనే వ్యక్తికి సరస్వతి బెహరాతో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఊరేగింపు వెరైటీగా జేసీబీలో చేయాలని భావించాడు పెళ్లికొడుకు గంగాధర్​. ఇందుకోసం జేసీబీ ఆపరేటర్​గా పనిచేస్తున్న తన తమ్ముడిని సంప్రదించాడు. దీంతో అతడు జేసీబీ ముందు భాగంలో వరుడికి సోఫా ఏర్పాటు చేశాడు. పూలు, బెలూన్లతో జేసీబీని అందంగా అలంకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వరుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. గతంలో గుజరాత్ నవ్​సారిలో ఓ జంట పెళ్లి ఊరేగింపు ఇలానే జేసీబీలో జరిగింది. జేసీబీ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో జేసీబీని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక జేసీబీలో వధూవరులు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Follow us on