Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. భావోద్వేగంతో వరుడి రియాక్షన్ ఏంటంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. తన కలలను సాకారం చేసుకునేందుకు.. ఇష్టమైన వారితో కలిసి ముందుకు సాగడమే పెళ్లి. ఇటీవలి కాలంలో వివహా వేడుకలు(Marriage) ఆడంబరంగా జరుగుతున్నాయి....

Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. భావోద్వేగంతో వరుడి రియాక్షన్ ఏంటంటే..
Groom Emotiion

Updated on: Mar 11, 2022 | 9:39 AM

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. తన కలలను సాకారం చేసుకునేందుకు.. ఇష్టమైన వారితో కలిసి ముందుకు సాగడమే పెళ్లి. ఇటీవలి కాలంలో వివహా వేడుకలు(Marriage) ఆడంబరంగా జరుగుతున్నాయి. జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఇష్టమైన వారిని మనువాడే సమయంలో కొందరు చిలిపి చేష్ఠలు చేస్తారు. అవి అక్కడున్న వారిని ఎంతో ఉత్సాహపరుస్తాయి. కానీ ఈ పెళ్లి బరాత్ లో జరిగిన ఈ ఘటన.. ఉద్వేగభరితమైనది. వరుడి రాక కోసం ఎదురు చూస్తున్న వధువు(Groom).. వరుడు రాగానే డ్యా్న్స్ చేస్తుంది. వరుడు తన బారాత్‌తో వివాహ వేదిక వద్దకు చేరుకోగా, వధువు అతని కోసం పింక్ లెహంగాలో అందంగా కనిపిస్తున్న వధువు మేరే హాత్ మే హై జో మెహందీ పాటకు డ్యాన్స్(Dance) చేస్తూ కనిపించింది. వధువు పాటకు డ్యాన్స్ చేయడంతో పాటు రొమాంటిక్ లిరిక్స్ వరుడి మనస్సును ఆకట్టుకోవడంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి ఆమె.. వరుడి కన్నీళ్లను ప్రేమగా తుడుచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read

Market News: ఎన్నికల బుల్ జోరుకు బ్రేక్.. వారాంతంలో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు..

Emotional Video: నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో.. తాతయ్యను విడిచి వెళ్లలేక చిన్నారి ఆవేదన..

Today mirchi rate: దుమ్మురేపుతున్న మిర్చి ధర.. రికార్డులు బ్రేక్.. క్వింటా రేటెంతో తెలిస్తే షాకే..