Emotional Video: నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో.. తాతయ్యను విడిచి వెళ్లలేక చిన్నారి ఆవేదన..
సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో ఒక చిన్నారి అమాయకపు ప్రేమకు మీరు కూడా కన్నీరు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని ఉంది. బయటి నుంచి తన తాతయ్య చిన్నారికి సెండాఫ్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో ఒక చిన్నారి అమాయకపు ప్రేమకు మీరు కూడా కన్నీరు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని ఉంది. బయటి నుంచి తన తాతయ్య చిన్నారికి సెండాఫ్ ఇస్తున్నారు. చిన్నారి తన తాతయ్యకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తోంది. తన తాతయ్యను విడిచి వెళ్లడం ఇష్టంలేకపోవడంతో దీనంగా బైబై చెప్తూ… ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తాతయ్యను విడిచి వెళ్లడం తప్పదని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ పాప తన తాతతో ఎంతటి అనుబంధాన్ని పెంచుకుందో వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లతో కంటనీరు పెట్టిస్తోంది. ఈ వీడియోలో ఉన్న మూడేళ్ల కామీ అనే చిన్నారికి తన ఇన్‌స్టా ఖాతాలో 131 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తల్లి, కోలెట్ లూయిస్, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు “మీరు మీ బెస్ట్ ఫ్రెండ్, తాతని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు” అంటూ క్యాఫ్షన్ అందించారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు తమ భావాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. “ఇది నన్ను కంటతడి పెట్టించింది. స్వీటెస్ట్ మోస్ట్ ఆరాడబుల్ బేబీ ఏంజెల్” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

