Groom Crying: పరిచయం స్నేహమై అది కాస్త ప్రేమగా మరి పెళ్లి పీటల వరకు వస్తే ఇదిగో ఇలా ఉంటుంది.. ఏడ్చేసిన వరుడు..!
ప్రేమించిన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? అలా తాను ప్రేమించిన యువతి తన జీవితభాగస్వామిగా రావడంతో ఆ వరుడు ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వరుడు .. పందిట్లో అడుగు పెడుతున్న వధువును చూసి ఏడుస్తూ కనిపించాడు. పెళ్లి దుస్తుల్లో అందమైన రాజకుమారిలా అడుగు పెడుతున్న తన ప్రేయసిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ వధువు రూపంలో వస్తున్న తన ప్రాణాన్ని ప్రేమతో ఆహ్వానించాడు. వధువు నవ్వుతూ వరుడి వద్దకు చేరుకుని అతనిని కౌగిలించుకుంది. వరుడి కన్నీళ్లను తుడిచింది. అయితే ఈ సమయంలో వధువు కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు నిజమైన ప్రేమికులు అంటూ కామెంట్ చేస్తున్నారు. తమకు అటువంటి ప్రేమ దక్కలేదు కదా అంటూ కొందరు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎప్పుడు తాము ఇష్టపడ్డవారిని పెళ్లి చేసుకుంటారో.. అప్పుడు ఆనందంతో ఇలా కన్నీరు వస్తుంది. దీనిని ఎవరూ ఆపలేరు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రేమ అదృష్టం వల్ల మాత్రమే దక్కుతుంది’ అని ఒకరు కామెంట్ చేస్తే.. అదృష్టం అంటే ఈ జంటదే అనిమరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

