groom In Wedding: పెళ్లిపీటల మీదినుంచి డైరెక్ట్ కటాకటాల్లోకి వరుడు… అసలేం జరిగిందంటే..

|

Apr 10, 2022 | 9:11 AM

పెళ్లంటేనే అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక. ఇక పెళ్లిలో బ్యాండ్.. డీజే ఉండడం కూడా సర్వసాధారణం.. కానీ ఇక్కడ ఓ పెళ్లిసందడిలో డీజే చిచ్చురేపింది. రెండు పెళ్లి బరాత్‌ల నడుమ చెలరేగిన వివాదంతో ఓ పెళ్లికొడుకుని జైలుపాలు చేసింది.


పెళ్లంటేనే అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక. ఇక పెళ్లిలో బ్యాండ్.. డీజే ఉండడం కూడా సర్వసాధారణం.. కానీ ఇక్కడ ఓ పెళ్లిసందడిలో డీజే చిచ్చురేపింది. రెండు పెళ్లి బరాత్‌ల నడుమ చెలరేగిన వివాదంతో ఓ పెళ్లికొడుకుని జైలుపాలు చేసింది. పెళ్లి మండపంలో తాళికట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..పెళ్లిపీటల మీదనుంచే వరుడిని నేరుగా కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దిల్వాపూర్ మండలం కాల్వతండాలో జరిగిన ఘర్షణ తీవ్ర సంచలనం రేపింది. రెండు పెళ్లి బారాత్ ల మద్య డీజీ వివాదంతో రెండు గ్రూప్‌లు తన్నుకున్నాయి.. మెగావత్ రాజు కుటుంబానికి బానావత్ సాయికుమార్ కుటుంబానికి మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. పరస్పరం దాడులకు దిగారు.. వైరి వర్గాలైన మెగావత్ రాజు, బానావత్ సాయికుమార్ ఇద్దరి పెళ్లిళ్లు ఒకే రోజు జరగడంతో డీజే సౌండ్ ల విషయంలో గొడవ తలెత్తింది.. పాత కక్షలను మనసులో పెట్టుకుని డీజే సౌండ్ తగ్గించాలంటూ వచ్చిన మరో పెళ్లి కొడుకు మెగావత్ రాజు బంధువైన మెగావత్ నవీన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. నవీన్‌ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల కారణంగా స్నేహితులతో కలిసి మెగావత్ నవీన్‌ను పెళ్లి బారాత్ లో చితక బాది హత్య చేసిన పెళ్లి కొడుకు సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..