Viral Video: నెట్టింట్లో వైరల్ వీడియోల సందడి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కాస్త ఫన్నీగా ఉంటే చాలు నెటిజన్లు వైరల్ చేసేస్తారు. అయితే తాజాగా ఓ బామ్మ చేసిన డ్యాన్స్.. నెట్టింట్లో సందడి చేస్తోంది. తన మనవడితో కలిసి సరదాగా తన స్టైల్‌లో చిందులు వేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. అలాగే అందరిని ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. వీడియోలో, 89 ఏళ్ల వృద్ధురాలు మహిళ ఓ పాటకు సరదాగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. కొన్ని వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అయిన అంకిత్ జాంగిద్ ఈ వీడియోను షేర్ చేశారు. “నా సోల్‌మేట్‌ను మా దాదీలో కనుగొన్నాను” అని క్యాప్షన్ అందించాడు.
వీడియోలో బామ్మ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌లతో తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ, నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింతి. ఆమె మనవడు కూడా ఆమె శైలిని అనుసరించాడు. ఇందులో నాగిని డ్యాన్స్ కూడా మిక్ చేశాడు. బామ్మ పింక్ చీర కట్టుకుని ఉండగా, ఆమె మనవడు చొక్కా, టైలో కనిపించాడు. 10 వేలకు పైగా లైక్‌లతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో కూడా బాగానే ఆకట్టుకుంటోంది. హార్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. బామ్మ నీ డ్యాన్స్ చాలా బాగుంది, ప్రత్యేకంగాను ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మొత్తానికి బామ్మ డ్యాన్స్ నెట్టింటిని షేక్ చేసేలా ఉంది.
ఈ వీడియోను మీరూ చూడండి:
Also Read: బెడిసికొట్టిన బైక్ స్టంట్.!యువకుడి అతి ఉత్సహం ఓ రేంజ్ గుణపాఠం..:Bike Stunt Viral Video.