Gold Theft: బ్యాగు చెక్ చేయాలని చెప్పి.. అరకేజీ బంగారం కొట్టేశారు.. తేరుకునే లోపే అంత పాయే..(వీడియో)
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అర కేజీ బంగారం చోరీ కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బంగారు నగలు తీసుకుని ఒంగోలులో డెలివరీ చేసేందుకు వచ్చిన
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అర కేజీ బంగారం చోరీ కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బంగారు నగలు తీసుకుని ఒంగోలులో డెలివరీ చేసేందుకు వచ్చిన బాలాజీని ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. తాము పోలీసులమని, గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందని బెదిరించారు. బ్యాగు చూపించాలంటూ సోదా చేశారు. బాలాజీని మాటల్లో పెట్టి బ్యాగులో ఉన్న బంగారాన్ని కొట్టేసారు. బ్యాగులో ఉన్న కొన్ని కాగితాలు, ఇతర వస్తువులను సోదా చేసి గంజాయి దొరకలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం బ్యాగ్‌ను చెక్ చేసుకున్న బాలాజీ ఇరవై లక్షల విలువైన 460 గ్రాముల బంగారం కనిపించలేదని గుర్తించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు.పార్సిల్ సర్వీస్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరాలకు ఫ్లెక్సీ అడ్డు రావడంతో బాలాజీని మోసం చేసిన వారి విజువల్స్ రికార్డు కాలేదు. ఈ ఘరానా చోరీకి పాల్పడింది బాలాజీని ముందు నుంచి అనుసరిస్తూ వచ్చిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలాజీ దగ్గర బంగారం ఉందని తెలుసుకుని పోలీసులమని చెప్పి సోదాల పేరుతో చాకచక్యంగా అపహరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వారి వివరాలు సేకరిస్తున్నారు. యజమాని అనుమతితో అన్ని వివరాలు తరువాత చెబుతానని బాధితుడు చెప్పాడు. కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..