Gold: నీ బూట్ల బంగారం కానూ.. ఇదేం పనిసామీ.. బూట్లలో, లోదుస్తుల్లో బంగారం.
ఎన్నిరకాలుగా నిఘా పెట్టినా.. అధికారుల కన్నుగప్పి బంగారాన్ని బార్డర్‌లు దాటించేస్తున్నారు స్మార్ట్ స్మగ్లర్స్. ఇటీవల ఎయిర్‌పోర్టుల్లో కిలోలకి కిలోలు బంగారం
ఎన్నిరకాలుగా నిఘా పెట్టినా.. అధికారుల కన్నుగప్పి బంగారాన్ని బార్డర్‌లు దాటించేస్తున్నారు స్మార్ట్ స్మగ్లర్స్. ఇటీవల ఎయిర్‌పోర్టుల్లో కిలోలకి కిలోలు బంగారం పట్టుబడుతోంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మార్చి 10న ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ముంబైకి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు సోదా చేశారు. వారి లోదుస్తులు, బూట్లలో బంగారం గుర్తించారు. మొత్తం తూకంవేయగా.. మూడు కిలోలు ఉన్నట్లు తేలిందని ముంబై ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటి 40 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. బూట్ల నుంచి చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ బయటికి తీసిన కస్టమ్స్ అధికారులు ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!