WhatsApp call: అర్ధరాత్రి అమ్మాయినుంచి వాట్సాప్‌ కాల్‌.. లిఫ్ట్ చేస్తే రూ.5 లక్షలు స్వాహా..!

WhatsApp call: అర్ధరాత్రి అమ్మాయినుంచి వాట్సాప్‌ కాల్‌.. లిఫ్ట్ చేస్తే రూ.5 లక్షలు స్వాహా..!

Anil kumar poka

|

Updated on: Mar 20, 2023 | 9:28 AM

ఒక్క వాట్సాప్‌ కాల్‌.. 5 లక్షలు వదిల్చింది. అన్‌ నోన్‌ నెంబర్‌నుంచి కాల్‌ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు, ఇంకా ఇతర సంస్థలు ఎంత మొత్తుకున్నా మనోళ్లు అప్రయత్నంగా

ఒక్క వాట్సాప్‌ కాల్‌.. 5 లక్షలు వదిల్చింది. అన్‌ నోన్‌ నెంబర్‌నుంచి కాల్‌ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు, ఇంకా ఇతర సంస్థలు ఎంత మొత్తుకున్నా మనోళ్లు అప్రయత్నంగా కాల్‌ లిఫ్ట్‌ చేయడంలో ఉచ్చులో పడటం మామూలైపోయింది. తాజాగా ఓ పాతికేళ్ల కుర్రాడికి రాత్రి 10 గంటల సమయంలో అన్‌నోన్‌ నెంబర్‌నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అవతల అమ్మాయి వాయిస్‌.. అ్రటాక్టివ్‌గా ఉంది.. కాసేపు మాట్లాడాడు.. ఇంతలో ఆ వాయిస్‌ కాస్తా నగ్నంగా ప్రత్యక్షమైంది. తేరుకునేలోపే కాల్‌ కట్‌ అయింది.. తిరిగా ఆ నెంబర్‌కి కాల్‌ చేస్తే నంబర్‌ బ్లాక్‌.. కట్‌ చేస్తే.. మర్నాడు ఉదయం సదరు యువకుడికి మరోనెంబర్‌నుంచి ఫోన్‌ వచ్చింది. తాను ఢిల్లీకి చెందిన పోలీసు అధికారినని, వీడియోకాల్స్‌ చేస్తూ మోసం చేస్తున్న మహిళల ముఠాను పట్టుకున్నామని, ఆ లిస్ట్‌లో నీ పేరు ఉంది, నీపై కేస్‌ లేకుండా చెయ్యాలంటే వెంటనే కొంత ఎమౌంట్‌ పంపించమని చెప్పాడు. దాంతో బెదిరిపోయిన యువకుడు 51,000 రూపాయలు పంపించాడు. అలా మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ యువకుడ్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోంది సైబర్‌ ముఠా.. దాదాపు 5 లక్షల వరకూ వదిలించుకున్నాక కానీ మనోడికి అర్థం కాలేదు.. ఈ పోలీసు కూడా ఆ మహిళ గ్యాంగ్‌కు చెందినవాడేనని. విషయం బోధపడ్డాక లబోదిబోమంటూ సైబర్‌ పోలీసుల వద్దకు పరుగుతీశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొత్తనెంబర్లనుంచి వచ్చే కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటన హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్‌ పరిధిలో మార్చి 9న జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 20, 2023 09:28 AM