తవ్వకాల్లో బయటపడిన 30 వేల ఏళ్లనాటి జీవి మమ్మీ..

|

May 31, 2023 | 9:53 PM

కెనడాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ గోల్డ్ డిగ్గర్‌కు యుకాన్‌లోని డాసన్ సిటీ సమీపంలోని క్లోన్‌డైక్ గోల్డ్ ఫీల్డ్‌లో ఓ ఫర్ బాల్ దొరికింది. మొదటిగా గోధుమ రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి.. ఏదో అరుదైన రాయిగా పురావస్తు శాస్త్రవేత్తలు భావించారు. కానీ దానిపై పలు పరిశోధనలు, ఎక్స్‌రేలు..

కెనడాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ గోల్డ్ డిగ్గర్‌కు యుకాన్‌లోని డాసన్ సిటీ సమీపంలోని క్లోన్‌డైక్ గోల్డ్ ఫీల్డ్‌లో ఓ ఫర్ బాల్ దొరికింది. మొదటిగా గోధుమ రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి.. ఏదో అరుదైన రాయిగా పురావస్తు శాస్త్రవేత్తలు భావించారు. కానీ దానిపై పలు పరిశోధనలు, ఎక్స్‌రేలు చేసిన అనంతరం ద్రాక్షపండు పరిమాణంలో ఉన్న ఈ లంప్ సుమారు 30 వేల ఏళ్ల నాటి ఐస్ ఏజ్‌కు చెందిన పురాతన మమ్మీఫైడ్ నేల ఉడతగా పరిశోధకులు తేల్చారు. ఏడాది వయసున్న ఆ ఉడత నిద్ర సమయంలో మరణించి ఉండొచ్చునని తెలిపారు. ఇన్నేళ్లు ఇది మంచులో కూరుకుపోయి ఉన్నప్పటికీ.. ఏమాత్రం చెక్కుచెదరలేదని.. అచ్చం ముడుచుకుపోయి.. నిద్రావస్థలో ఉన్నట్లే ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అది చూడటానికి పైకి గోధుమ రంగు రాయిలా కనిపిస్తుందని జెన్ హీత్ అనే పశువైద్యురాలు తెలిపింది. కాగా, క్లోన్‌డైక్ గోల్డ్ ఫీల్డ్స్ మంచు యుగం నుంచి శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఐస్ ఏజ్ కాలంలో చనిపోయిన జీవులకు సంబంధించిన జుట్టు, గోర్లు అన్నింటిని సంరక్షించడానికి ఆ ప్రాంతం సరైనదని చెబుతున్నారు. గతంలో ఇదే చోట మమ్మీఫైడ్ తోడేలు పిల్ల, బేబీ మముత్‌ను పరిశోధకులు కనుగొన్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌లో పెట్రోల్‌ కొట్టిస్తూ లైటర్‌ వెలిగించిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

సో క్యూట్‌.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్‌ చిన్నారి

అంతరించిపోతున్న అరుదైన జంతువు..

నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి

Mahesh babu: తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్

 

Follow us on