నౌకలో దొరికిన కోట్ల విలువైన బంగారం !!

|

Jun 18, 2022 | 9:14 PM

స్పానిష్ యుద్ధంలో ముగిగిన రెండు నౌక‌ల‌ను కొలంబియా అధికారులు గుర్తించారు. 1708లో బ్రిటీష్ దాడిలో సాన్ జోస్ యుద్ధ నౌక‌ మునిగిపోయింది. అయితే ఆ నాటి తెర‌చాప నౌక శిథిలాల‌ను గుర్తించారు.

స్పానిష్ యుద్ధంలో ముగిగిన రెండు నౌక‌ల‌ను కొలంబియా అధికారులు గుర్తించారు. 1708లో బ్రిటీష్ దాడిలో సాన్ జోస్ యుద్ధ నౌక‌ మునిగిపోయింది. అయితే ఆ నాటి తెర‌చాప నౌక శిథిలాల‌ను గుర్తించారు. ఆ నౌక‌ల్లో త‌ర‌లించిన సుమారు 17 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన బంగారాన్ని కూడా గుర్తించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. స్పానిష్ స‌క్సెస‌న్ యుద్ధంలో బ్రిటీష్ నౌక‌లు జ‌రిపిన దాడిలో సాన్ జోస్ నౌక నీటి మునిగింది. ఆ నౌక‌లో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభ‌ర‌ణాలు, ఇంకా బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే అప్ప‌టి నౌకా ద‌ళానికి చెందిన రెండు ఓడ‌ల శిథిలాల‌ను ఇప్పుడు గుర్తించారు. ఆధునిక టెక్నాల‌జీతో త‌యారైన రిమోట్ వెహికిల్‌తో స‌ముద్ర గ‌ర్బంలోకి వెళ్లి ఆ శిథిలాల‌ను ప‌సిక‌ట్టారు. సుమారు 3100 ఫీట్ల లోతుకు ఆ రిమోట్ వెహికిల్ వెళ్లి ఓడ‌ల శిథిలాల‌ను గుర్తించిన‌ట్లు కొలంబియా అధికారులు వెల్ల‌డించారు. నీట మునిగిన ఫిరంగులు కూడా ఆ వీడియోలో క‌నిపిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .

వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు

మీ పిల్లలను స్కూలు కు పంపకపోతే ఇంటిముందునుంచి కదలనన్న డీఈఓ !!

ఫస్ట్ నైట్ కి ముందు వరుడు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏంచేశాడో తెలుసా ??

Published on: Jun 18, 2022 09:14 PM