Watch Video: ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానం.. డోర్‌ తెరిచి చూడగానే అద్భుతం.!

|

Mar 22, 2024 | 1:21 PM

ప్రకృతిని మించిన అద్భుతం మరొకటి లేదు. ప్రకృతి ప్రశాంతంగా ఉంటే అందమైన ఎన్నో అనుభూతులు కలిగిస్తుంది.. ప్రకోపించిందో విశ్వరూపం చూపిస్తుంది. సాధారణంగా ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు.. అస్తమిస్తాడు. ఈ రెండూ ఎంతోప్రత్యేకమైనవి. అరుణోదయం వేళ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. సూర్యోదయంతో విశ్వం మొత్తం ఉత్తేజితమవుతుంది. అలాగే సూర్యాస్తమయంతో విశ్రాంతి తీజుకుంటుంది.

ప్రకృతిని మించిన అద్భుతం మరొకటి లేదు. ప్రకృతి ప్రశాంతంగా ఉంటే అందమైన ఎన్నో అనుభూతులు కలిగిస్తుంది.. ప్రకోపించిందో విశ్వరూపం చూపిస్తుంది. సాధారణంగా ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు.. అస్తమిస్తాడు. ఈ రెండూ ఎంతోప్రత్యేకమైనవి. అరుణోదయం వేళ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. సూర్యోదయంతో విశ్వం మొత్తం ఉత్తేజితమవుతుంది. అలాగే సూర్యాస్తమయంతో విశ్రాంతి తీజుకుంటుంది. ఈ సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అందంగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. తాజాగా అలాంటి అద్భుత దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ వీడియో మెక్సికోకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఓ విమానం ల్యాండ్‌ అయింది. ఫ్లైట్‌ అటెండెంట్స్‌ డోర్‌ ఓపెన్‌ చేయగానే ఎదురుగా అద్భుత దృశ్యం దర్శనమిచ్చింది. చూస్తుంటే సూర్యాస్తమయం అవుతున్నట్టుంది. ఆకాశానికి ఎవరో నారింజ, గులాబీ, పసుపు రంగులు అద్దినట్టుగా అత్యంత సుందరంగా ఉందా దృశ్యం. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సూర్యడు భూమిని తాకుతున్నాడా అన్నట్టుగా ఆకాశం నుంచి భూమి వరకూ నారింజ, ఎరుపు, పసుపు రంగులు కలగలసిన అద్భుత వర్ణం కమ్మేసింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈవీడియోను ఇప్పటికే 22.5 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో లైక్‌ చేస్తూ , తమదైన శైలిలో కామెంట్లు చేశారు. మెక్సికో సూర్యాస్తమయం ప్రకృతి రమణీయం. ఆకాశంలో కనిపించే రంగులు మంత్రముగ్ధులను చేస్తాయి అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..