Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!
జిరాఫీని అందరూ చూసే ఉంటారు. పొడవాటి మెడతో, ఒంటినిండా మచ్చలతో బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ అరుదైన జిరాపీ జన్మించింది. ఇలాంటి జిరాఫీ పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అంటున్నారు. అవును, టెన్నెస్సీలో ఉన్న బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన మచ్చల్లేని పిల్లకు ఓ జిరాఫీ జన్మనిచ్చింది. దీంతో దాని శరీరం నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది. శరీరంపై మచ్చల్లేని జిరాఫీ జన్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
జిరాఫీని అందరూ చూసే ఉంటారు. పొడవాటి మెడతో, ఒంటినిండా మచ్చలతో బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ అరుదైన జిరాపీ జన్మించింది. ఇలాంటి జిరాఫీ పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అంటున్నారు. అవును, టెన్నెస్సీలో ఉన్న బ్రైట్స్ జూలో అత్యంత అరుదైన మచ్చల్లేని పిల్లకు ఓ జిరాఫీ జన్మనిచ్చింది. దీంతో దాని శరీరం నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది. శరీరంపై మచ్చల్లేని జిరాఫీ జన్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. జులై 31న జన్మించిన ఈ జిరాఫీకి ఇంకా పేరు పెట్టలేదు. శరీరమంతా మొత్తం బ్రౌన్ కలర్‌లో ఉన్న ఈ ఆడ జిరాఫీకి ఒంటిపై మచ్చలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని జూ అధికారులు తెలిపారు. ఈ భూమిపైనే ఇలాంటి జిరాఫీ మరోటి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ జిరాఫీ పిల్ల తల్లి సంరక్షణలో పెరుగుతోంది. ఇది రెటిక్యులేటెడ్ జిరాఫీ అని, అంతరించిపోతున్న జాతికి చెందినదని చెబుతున్నారు. కాగా, జిరాఫీలు వేగంగా అంతరించిపోతున్నాయని, గత మూడు దశాబ్దాలలో 40 శాతం జిరాఫీలు మాయమయ్యాయని బ్రైట్స్ జూ వ్యవస్థాపకుడు టోనీ బ్రైట్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్ ట్విస్ట్ !!
TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్
Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

