AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ

వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ

Phani CH
|

Updated on: Sep 24, 2025 | 1:42 PM

Share

వర్షాకాలం వస్తూ వస్తూ పాములను వెంటేసుకొస్తుంది. పాములు, తేళ్లు.. వర్షాలు పడటంతో బయటకు వస్తాయి. వరద నీటితో పాటు ఇళ్లల్లోకి పాములు చొరబడతాయి. ఇళ్ళ ముందు బైక్‌లు, కార్లలోనూ దాక్కుంటాయి. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండక తప్పదు. పాముకాటుకు పలువురు మృతి చెందిన ఘటనలు ఈ సీజన్‌లో ఎక్కువ.

తాజాగా ఓ భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కారు బానెట్‌ కింద కొండ చిలువ బొజ్జున్న వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా సత్నమ్ పుర్వాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కారు నడుపుతున్నారు. బానెట్‌ కింద ఏదో అలజడి అవ్వడం గమనించారు. దీంతో కారు ఆపి బానెట్‌ ఓపెన్‌ చేయడంతో అక్కడ కనిపించింది చూసి షాకయ్యారు. ఇంజన్‌ పైన ఏడడుగుల భారీ కొండ చిలువ ముడుచుకుని పడుకుంది. కొండచిలువను చూడగానే భయంతో ఆ వ్యక్తి దూరంగా పరిగెత్తాడు. స్థానికులు కొందరు ధైర్యం చేసి కారు వద్దకు చేరుకుని వీడియోలు తీయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండ చిలువను బంధించి అడవిలో విడిచిపెట్టారు. కారులో నగరాన్ని చుట్టేద్దామని వయ్యారి కొండచిలువ వచ్చినట్లుందని.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా

విజయవాడ భవానిపురంలో దారుణం

Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట

Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు

AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం