Batthula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం కొనసాగుతున్న వేట
పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏఆర్ డీసీపీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు డ్రోన్ల సాయంతో రాజమండ్రి పరిసరాల్లో గాలింపు చేస్తున్నాయి. ప్రభాకర్ సన్నిహితులను విచారిస్తున్నారు.
పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజమండ్రి పరిసరాల్లో అతని కోసం గాలింపు జరుగుతోంది. ఏఆర్ డీసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు, డ్రోన్ల సాయంతో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో గాలిస్తున్నాయి. ప్రభాకర్ సన్నిహితులు, స్నేహితులను విచారిస్తున్నారు. అతను పరారైన రోజు హైవేపై ఉన్న వాహనాలు మరియు సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రభాకర్ చేతికి సంకెళ్లు ఉండగానే పారిపోవడంతో, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అతని వద్ద తుపాకీ ఉందని అనుమానిస్తున్నారు. పారిపోయే సమయంలో బ్లాక్ టీ షర్ట్ మరియు ట్రాక్ ప్యాంట్ ధరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Cholera Cases: గుంటూరు జిల్లాలో 7కి చేరిన కలరా కేసులు
AP Assembly 2025: PPP విధానంపై తగ్గేదే లేదంటున్న ఏపీ ప్రభుత్వం
Kakinada: ఆ కంపెనీలకు లాక్లు వేయండి అంటూ మత్స్యకారుల ఆందోళన
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

