విశాఖలో ఆధార్‌ కార్డుల పేరుతో మోసాలు… వేలిముద్ర వేస్తే రూ.500/..ఆధార్‌,పాన్‌కార్డు ఉంటే…!! ( వీడియో )

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఘరానా మోసం వెలుగు చూసింది. వేలి ముద్ర వేస్తే ఐదు వందలు. పాన్ కార్డు, ఆధార్‌ కార్డు చూపిస్తే ఐదు వందలు అంటూ..

  • Publish Date - 6:06 pm, Tue, 22 June 21

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఘరానా మోసం వెలుగు చూసింది. వేలి ముద్ర వేస్తే ఐదు వందలు. పాన్ కార్డు, ఆధార్‌ కార్డు చూపిస్తే ఐదు వందలు అంటూ.. అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు స్థానికులు. కేటుగాళ్లను చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పెదగంట్యాడ మండలం వికాస్ నగర్ సమీపంలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నవాళ్లు.. వాటిని చూపించి వేలు ముద్ర వేస్తే 5 వందలు రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. విషయం తెలియక పాన్ కార్డ్, ఆధార్ కార్డులతో అక్కడ చాలా మంది గుమిగూడారు. వారిలో కొంత మంది వేలి ముద్రలు తీసుకున్నారు. కార్డు లేనివారికి కార్డులు కూడా ఇప్పిస్తామని వేలిముద్రలు తీసుకున్నారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: China Vaccination: ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో డ్రాగన్ కంట్రీ.. ప్రజలకు 100కోట్ల పైగా డోసులు.. ( వీడియో )

Gold And Silver Price: మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి… ( వీడియో )