ఉన్నచోటే నిమజ్జనమయిన గణనాథుడు.. ప్రయోగం సక్సెస్..

|

Oct 02, 2023 | 8:13 PM

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ యువకులు వినూత్న రీతిలో వినాయకుడి నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కుత్బుల్లాపూర్ భవానినగర్ సూరారంకాలనీ శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ దేవాలయం ఆవరణలో 18 అడుగుల మట్టి వినాయకుడి ఏర్పాటు చేశారు. అదీ కూడా పూర్తిగా మట్టితో పర్యావరణహితంగా తయారు చేయించి నవరాత్రి పూజలు నిర్వహించారు.

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ యువకులు వినూత్న రీతిలో వినాయకుడి నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కుత్బుల్లాపూర్ భవానినగర్ సూరారంకాలనీ శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ దేవాలయం ఆవరణలో 18 అడుగుల మట్టి వినాయకుడి ఏర్పాటు చేశారు. అదీ కూడా పూర్తిగా మట్టితో పర్యావరణహితంగా తయారు చేయించి నవరాత్రి పూజలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ చైతన్యం ప్రజల్లో గణనీయంగా పెరుగుతోంది. గణేషుడి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. రసాయనాలు, లోహ పదార్థాలు లేకుండా గడ్డి, బురద మట్టితో ఈ విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. ఈక్రమంలో్నే శీలం వీరేంద్ర కుమార్ అధ్వర్యంలో అంగరంగా వైభవంగా పూజలందుకున్నాడు మట్టి గణనాథుడు. చివరి రోజు పూలాభిషేకం, పంచామృత అభిషేకాల అనంతరం నీటి ఫోర్స్ పంపుల సహకారంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమ్మీద నూకలు ఉన్నాయి.. రైలు కింద పడ్డా సేఫ్..

నల్లుల దెబ్బకు ఫ్రాన్స్ విల.. విల..

‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..

నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు

యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్‌ కోసం అలాచేస్తే అంతే