అధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు..
దేశరక్షణలో సైనికులతో పాటు శునకాలు కూడా తమదైన పాత్ర పోషిస్తాయి. ప్రాణాలకు తెగించి సైనికులకు సహకరిస్తాయి. అలాగే పోలీసు శాఖలో కూడా నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాల పాత్ర ప్రముఖమైనది. అలా సేవలందించి తమ ప్రాణాలకు కోల్పోయిన జాగిలాలను వీర సైనికులుగా భావించి వాటికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో తొమ్మిదేళ్ళు విశేష సేవలందించిన పోలీసు శునకం జెస్సీ కన్నుమూసింది.
దేశరక్షణలో సైనికులతో పాటు శునకాలు కూడా తమదైన పాత్ర పోషిస్తాయి. ప్రాణాలకు తెగించి సైనికులకు సహకరిస్తాయి. అలాగే పోలీసు శాఖలో కూడా నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాల పాత్ర ప్రముఖమైనది. అలా సేవలందించి తమ ప్రాణాలకు కోల్పోయిన జాగిలాలను వీర సైనికులుగా భావించి వాటికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో తొమ్మిదేళ్ళు విశేష సేవలందించిన పోలీసు శునకం జెస్సీ కన్నుమూసింది. జెస్సీ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో అక్టోబరు 29న పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచింది. తమతో కలిసి ఎంతో చురుకుగా విధులు నిర్వహించిన జెస్సీ మృతితో పోలీసులంతా కంటతడి పెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి.నాగేశ్వర రావు పర్యవేక్షణలో పోలీస్ డాగ్ స్క్వాడ్ యూనిట్ లో జెస్సీ అంత్యక్రియలు నిర్వహించారు. జెస్సీ కి శాలువా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు విధుల్లో జెస్సీ డాగ్ చేసిన సేవలను కొనియాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Onion Prices : ఉల్లి ఘాటు.. కిలో రూ.70కి చేరిక !! టమాటా కూడా పైపైకి
అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు
కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??