రూ.19 లక్షలతో చెత్త కొన్నాడట..  కారుకు బ్యానర్ చూసి షాక్ అవుతున్న జనం

రూ.19 లక్షలతో చెత్త కొన్నాడట.. కారుకు బ్యానర్ చూసి షాక్ అవుతున్న జనం

Phani CH

|

Updated on: Jun 07, 2022 | 8:40 AM

అసంతృప్తతో ఉండే కస్టమర్లు నిజంగా ఎంత దూరమైన వెళ్తారు. ఓ కియా కేరెన్స్ ఓనర్.. వాహనం వెనుక భాగంలో బ్యానర్‌ను అంటించి తన కారును ఊరేగిస్తున్నాడు.

అసంతృప్తతో ఉండే కస్టమర్లు నిజంగా ఎంత దూరమైన వెళ్తారు. ఓ కియా కేరెన్స్ ఓనర్.. వాహనం వెనుక భాగంలో బ్యానర్‌ను అంటించి తన కారును ఊరేగిస్తున్నాడు. కియా కార్లను కొనుగోలు చేయవద్దని ఇతరులను కోరుతూ అందులో సందేశం రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే తన అసంతృప్తికి కారణమేమిటో మాత్రం అతను తెలియజేయలేదు. “కియా కార్లు కొనాలనుకునేవారు అప్రమత్తంగా ఉండండి, నేను కియా చెత్తను రూ. 19 లక్షలకు కొన్నాను” అనే బ్యానర్‌ తన కారుకు అతికించి సదరు యజమాని తిరుగుతున్నాడు. ఆ బ్యానర్లలో అతను తన ఫోన్ నంబర్ ను సైతం రాశాడు. సదరు కస్టమర్ హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న కియా ప్రధాన కార్యాలయం చుట్టూ తన కారెన్స్ MPV కారును నడిపాడు. కియా అధికారుల దృష్టిలో పడేందుకే ఇలా చేశాడని తెలుస్తోంది. కస్టమర్ కారు పట్ల ఎందుకు అసంతృప్తిగా ఉండటానికి గల ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేదు. వాస్తవానికి, ఉత్పత్తి పరిమితుల కారణంగా చాలా మంది వినియోగదారులు బుకింగ్‌లను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్‌ !! బ్యాలెన్స్ తప్పితే ఇక అంతే సంగతులు !!

కొండ అంచున విమానం !! విమానం రెక్కపై వ్యక్తి !! స్టన్నింగ్‌ వీడియో

ఎంట్రీ సీన్‌కు 32 రోజులా !! చరణ్ కష్టం మామూలుగా లేదుగా !!

 

Published on: Jun 07, 2022 08:40 AM