Viral Video: పరీక్షకు వెళ్తున్న విద్యార్ధులు.. పోలీసులు ఏంచేశారో తెలుసా..?

Viral Video: పరీక్షకు వెళ్తున్న విద్యార్ధులు.. పోలీసులు ఏంచేశారో తెలుసా..?

Anil kumar poka

|

Updated on: Aug 05, 2023 | 7:17 PM

అప్పటికప్పుడు ఓ క్రేన్ ను పిలిపించి, ఆ క్రేన్ పై విద్యార్థులను కూచోబెట్టి క్షేమంగా వరద ప్రవాహాన్ని దాటించారు. అంతేకాదు, పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చారు. విద్యార్ధుల పట్ల పోలీసుల తీరుకు ప్రజలు అభినందనలు కురిపించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం తమ పోలీసులను అభినందించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి ఉప్పొంగింది. దాంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో ఓ సెమిస్టర్ పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థులు కొందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు వెళ్లే మార్గం లేక పోలీసులను ఆశ్రయించారు. విద్యార్ధుల పరిస్థితిని అర్ధం చేసుకుని మానవతా దృక్పధంతో స్పందించిన పోలీసులు విద్యార్ధులకు సహాయం చేశారు. అప్పటికప్పుడు ఓ క్రేన్ ను పిలిపించి, ఆ క్రేన్ పై విద్యార్థులను కూచోబెట్టి క్షేమంగా వరద ప్రవాహాన్ని దాటించారు. అంతేకాదు, పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చారు. విద్యార్ధుల పట్ల పోలీసుల తీరుకు ప్రజలు అభినందనలు కురిపించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం తమ పోలీసులను అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...