Viral Video: సైగలతో ఆర్డర్ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో
అదొక ప్రత్యేకమైన హోటల్.. అక్కడ అంతా సైగలతోనే పలకరించుకుంటారు.. సైగలతోనే ఆర్డర్స్, సైగలతోనే సర్వ్ చేస్తారు.. ఎందుకంటే అది బదిరుల హోటల్ కాబట్టి.
అదొక ప్రత్యేకమైన హోటల్.. అక్కడ అంతా సైగలతోనే పలకరించుకుంటారు.. సైగలతోనే ఆర్డర్స్, సైగలతోనే సర్వ్ చేస్తారు.. ఎందుకంటే అది బదిరుల హోటల్ కాబట్టి. మహారాష్ట్రలోని పుణెలో ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న టెర్రాసైన్ హోటల్‌లోకి అడుగుపెట్టగానే అక్కడి సిబ్బంది చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. సైగలతోనే ఒకరికొకరు సంభాషించుకుంటారు. ఎందుకంటే వారంతా బధిర యువతీయువకులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఆ హోటల్ సిబ్బంది మొత్తం వినికిడి-మూగ సమస్యతో బాధపడుతున్న వారే. అయినా ఎంతో విజయవంతంగా హోటల్‌ను నిర్వహిస్తున్నారు. బధిర యువతీయువకుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో టెర్రాసైన్ పేరుతో హోటల్‌ను స్థాపించారు సోనమ్ కపాసే. ఒకరినొకరు సంభాషించుకునేందుకు సిబ్బందికి సంజ్ఞల భాషను నేర్పించారు.
Also Watch:
Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో
Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్ !! వీడియో